థియేటర్‌లో సినిమా చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

  • తొర్రూరులో అశ్విని సినిమా థియేటర్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
  • జయం మనదే సినిమాను వీక్షించిన ఎర్రబెల్లి దయాకర రావు
  • థియేటర్‌లో సినిమా చూస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుందన్న మంత్రి
సినిమాలను థియేటర్లలో చూస్తే వచ్చే ఆనందం వేరుగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో పునరుద్ధరించిన అశ్విని సినిమా థియేటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా థియేటర్‌లో ప్రదర్శించిన జయం మనదే సినిమాను కాసేపు వీక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. సినిమాలను థియేటర్లలోనే చూడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

Errabelli
BRS
Telangana Assembly Election

More Telugu News